రేపు రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవు: విజయవాడ సీపీ కాంతిరాణా టాటా
- న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలో ఆంక్షలు
- విజయవాడలో సెక్షన్-30 అమల్లో ఉందన్న సీపీ కాంతిరాణా టాటా
- రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని వెల్లడి
- ప్రతి చోటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని స్పష్టీకరణ
ప్రజలు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024కు స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే, పోలీసులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు మితిమీరి ప్రవర్తించకుండా ఆంక్షలు విధిస్తున్నారు.
నూతన సంవత్సరాది సందర్భంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జనవరి 1న ఎంజీ రోడ్డు, బందరు రోడ్డు, ఫ్లైఓవర్ లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు.
విజయవాడ నగరంలో సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రేపు రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబరు 31 రాత్రి ప్రతి చోటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. విజయవాడ ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సీపీ స్పష్టం చేశారు.