ఇండోనేషియాలో భారీ భూకంపం...తీవ్రత ఎంతంటే?
- ఆదివారం తెల్లవారు జామున సంభవించిన తీవ్ర భూప్రకంపనలు
- ద్వీపసమూహంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు
- సునామీ ముప్పు లేదని ప్రకటన
భూకంపాలకు నిలయమైన ఇండోనేషియా దేశంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ప్రారంభ సమయాన భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని పపువా ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. పపువా ప్రావిన్స్ రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మళ్లీ భూకంపం వస్తుందా?
ఇండోనేషియా భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీనివల్ల తీవ్రమైన నష్టం లేదా ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు అందలేదు. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియాలోని వాతావరణ కేంద్రం జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపింది. అయితే భూకంపం భూమిలో కేంద్రీకృతమై ఉన్నందున మరోసారి భూకంపం సంభవించే అవకాశం ఉందని జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరించింది.
కేవలం 62,250మంది జనాభాతో ఇండోనేషియాలోని అతి తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో అబేపురా ఒకటి. ఫిబ్రవరి నెలలో సంభవించిన భూకంపం ప్రావిన్స్‌ను కదిలించింది. తేలియాడే రెస్టారెంట్ సముద్రంలో కూలిపోయినప్పుడు నలుగురు వ్యక్తులు మరణించారు. ఇండోనేషియా దేశం 270 మిలియన్ల జనాభాతో విస్తారమైన ద్వీపసమూహం. ఈ దేశంలో పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు తరచూ విస్పోటనం చెందుతుంటాయి.
రింగ్ ఆఫ్ ఫైర్
ఫాల్ట్ లైన్‌ల ఆర్క్ అయిన రింగ్ ఆఫ్ ఫైర్ పై దాని స్థానం కారణంగా ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు,అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో నవంబర్ 21వతేదీన 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించగా, మరో 600 మంది గాయపడ్డారు. సులవేసిలో 2018వ సంవత్సరంలో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 4,340 మంది మరణించారు. 2004వ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన హిందూ మహాసముద్ర భూకంపం వల్ల డజను దేశాల్లో 230,000 కంటే ఎక్కువ మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌లో ఉన్నారు.