ఆ నెటిజన్ ఆలోచనతో ఏకీభవిస్తున్నా: కేటీఆర్
- కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడన్న నెటిజన్
- 32 యూట్యూబ్ చానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ట్వీట్
- ఆ నెటిజన్ సూచన ఉత్తమమైనదన్న కేటీఆర్
- ఆ యూట్యూబ్ చానళ్లతో అసత్య ప్రచారాన్ని ఎదుర్కోగలిగేవారమని వెల్లడి
రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఆ నెటిజన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.
కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ చానళ్లు ఉపయోగపడేవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడని, ఆలోచిస్తుంటే ఆ నెటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు.