టీడీపీ కార్యకర్తలు రమణ, కనకారావు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ
- చంద్రబాబు అరెస్ట్ అనంతరం పలువురు కార్యకర్తల మృతి
- మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
- ఆర్థికసాయం అందజేత
ఆమధ్య స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఇవాళ ఆమె విశాఖలో పర్యటించారు. విశాఖ సౌత్ నియోజకవర్గం 41వ వార్డులో మలిశెట్టి రమణ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
రమణ(55), అక్టోబరు 9న గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో, రమణ కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అతడి కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.3 లక్షల చెక్కు అందజేశారు.
అటు, విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త కనకారావు కుటుంబాన్ని కూడా నారా భువనేశ్వరి పరామర్శించారు. విశాఖ నార్త్ నియోజకవర్గం 45వ వార్డులో, పంచిరెడ్డి కనకారావు కుటుంబాన్ని నారా భువనేశ్వరి కలిశారు.
కనకారావు(52) సెప్టెంబరు 9న గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో, కనకారావు కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కనకారావు కుటుంబ సభ్యులకు ఆర్థికసాయంగా రూ.3 లక్షల చెక్కు అందజేశారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.