ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్
- ప్రతి ఏడాది మాదిరిగానే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ
- ప్రకటించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ
- సోమవారం సమావేశమై నిర్ణయించిన కార్యవర్గ సభ్యులు
పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీ సోమవారం ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా దీనిని నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు. బుక్ ఫెయిర్ ఆఫీస్‌లో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన సోమవారం కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కోశాధికారి పి.రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్దన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్.వాసు బాధ్యతలు స్వీకరించారు. పుస్తక ప్రియులు, పాఠకులు ఈ ఏడాది బుక్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు.