'నా సామిరంగ' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ విడుదల!

  • నాగార్జున హీరోగా రూపొందిన 'నా సామిరంగ' 
  • దర్శకుడిగా విజయ్ బిన్ని పరిచయం
  • ప్రధానమైన బలంగా కీరవాణి సంగీతం 
  • ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న సినిమా

'నా సామిరంగ' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ విడుదల!
నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగా'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయికగా అలరించనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే .. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే ..' అంటూ ఈ పాట సాగుతోంది. నాగార్జున - ఆషిక రంగనాథ్ కాంబినేషన్లో .. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన పాట ఇది. ఫీల్ తో కూడిన మెలోడీ సాంగ్ ఇది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మమన్ కుమార్ - సత్య యామిని ఆలపించారు. 

 ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. అల్లరి నరేశ్ సరసన మిర్నా .. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనున్నారు. సరదాలు .. సందళ్లు ... ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. సంక్రాంతి పండుగకి సంబంధించిన సన్నివేశాలు ... డైలాగ్స్ ఉండటం ఈ సినిమాను ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


More Telugu News