ఇది నా రిక్వెస్ట్... మన కోసం.. మనందరి కోసం చెబుతున్నా.. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి: కొండా సురేఖ

  • పర్యావరణ శాఖ మంత్రిగా ఈ సందేశం ఇస్తున్నట్లు చెప్పిన మంత్రి
  • ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఉపయోగించవద్దని విజ్ఞప్తి
  • గాజు గ్లాస్‌లు ఉపయోగించాలని సూచించిన మంత్రి
ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'అందరికీ నమస్కారం...' అంటూ ప్రారంభించారు. పొల్యూషన్‌ను తగ్గించుకోవాలని.. ఎన్విరాన్‌మెంట్ బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామన్నారు.

ఓ పర్యావరణ శాఖ మంత్రిగా నేను ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నానని.. ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. మనం.. మన భవిష్యత్తు తరాల వారు ఆరోగ్యంగా ఉండాలంటే.. పర్యావరణాన్ని కాపాడటం కోసం దయచేసి ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించవద్దని కోరారు. గాజు గ్లాస్‌లు మాత్రమే వాడాలని కోరారు. 'ఇది నా రిక్వెస్ట్.. మన కోసం.. మనందరి కోసం చెబుతున్నా'నని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ ప్లాస్టిక్ బాటిల్‌ను చూపిస్తూ ఇలాంటి వాటిని ఉపయోగించవద్దని కోరారు. అలాగే గాజు గ్లాస్‌ను, గాజు జగ్గును తీసుకొని... వాటిని చూపిస్తూ ఇలాంటివి ఉపయోగించాలని కోరారు.


More Telugu News