లండన్ లో సీఎం రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన యువతి.. వీడియో ఇదిగో!
- దావోస్ పర్యటన ముగించుకుని లండన్ లో పర్యటిస్తున్న రేవంత్
- ఓ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన
- రేవంత్ కు బొకే ఇచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన అమ్మాయి
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. రేవంత్ లండన్ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో రేవంత్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో ఓ అమ్మాయి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది. ఆ తర్వాత ఆనందంతో ఎగురుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేయి చాచగా... ఆమె ఉత్సాహాన్ని చూసిన రేవంత్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ పై ప్రజలకు ఉన్న అభిమానం ఇది అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. రేవంత్ ఎక్కడకు వెళ్లినా ఆయన అభిమానులు ఉంటారని అంటున్నారు.
మరోవైపు ఈ నెల 15 నుంచి 19 వరకు కొనసాగిన రేవంత్ దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణకు పెట్టుబడులను సాధించడంలో రేవంత్ టీమ్ సక్సెస్ అయింది. రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.