అయోధ్య రామాలయానికి రూ. 2.66 కోట్ల విరాళం ఇచ్చిన హనుమాన్ సినిమా టీం
- ఇప్పటి వరకు 53,28,211 టికెట్ల అమ్మకం
- మొత్తం రూ. 2,66,41,055 విరాళం ఇస్తున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం
- సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించిన హనుమాన్
సంక్రాంతి పండుగ బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించింది హనుమాన్ సినిమా. ఈ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ నుంచి రూ. 5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించిన చిత్రబృందం అనుకున్నట్టే ఇప్పటి వరకు వచ్చిన రూ. 2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి రూ. 5 చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది.
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘కోటి’ అనే వానరానికి ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.