ఇంగ్లండ్ తో తొలి టెస్టు: పట్టు బిగిస్తున్న టీమిండియా

  • హైదరాబాదులో తొలి టెస్టు
  • మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 ఆలౌట్
  • రెండో రోజు ఆట చివరికి 7 వికెట్లకు 421 పరుగులు చేసిన భారత్
  • రాణించిన జడేజా (81 బ్యాటింగ్), జైస్వాల్ (80), కేఎల్ రాహుల్ (86)
ఇంగ్లండ్ తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 421 పరుగులు చేసింది. 

రవీంద్ర జడేజా 81 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జడేజా స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అక్షర్ పటేల్ 35 (బ్యాటింగ్) కూడా రాణించడంతో టీమిండియా స్కోరు 400 మార్కు దాటింది. తెలుగుతేజం కేఎస్ భరత్ 41 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ 80, కేఎల్ రాహుల్ 86, కెప్టెన్ రోహిత్ శర్మ 24, శుభ్ మాన్ గిల్ 23, శ్రేయాస్ అయ్యర్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్ 2, టామ్ హార్ట్ లే 2, జాక్ లీచ్ 1, రెహాన్ అహ్మద్ 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 175 పరుగులు కాగా... రేపు మూడో రోజు ఆటలో ఎన్ని పరుగులు చేస్తే అంత లాభం! తద్వారా ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచే వీలుంటుంది.


More Telugu News