మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయమన్నారు.. నా కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరా: మల్లారెడ్డి
- కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదన్న మల్లారెడ్డి
- ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని వ్యాఖ్య
- నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ ను కలవడంలో తప్పులేదన్న మల్లారెడ్డి
తెలంగాణ పాలిటిక్స్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన ఏది మాట్లాడినా, ఏం చేసినా సంచలనంగా మారుతుంది. తాజాగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచిన షాక్ నుంచి తాము ఇంకా కోలుకోలేదని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం తనకు చెప్పిందని... అయితే, మల్కాజిగిరి ఎంపీ టికెట్ ను తన కుమారుడికి ఇవ్వాలని కోరానని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి తప్పు లేదని మల్లారెడ్డి అన్నారు. త్వరలోనే రేవంత్ ను కలుస్తానని... గతంలో టీడీపీలో ఇద్దరం కలిసే పని చేశామని చెప్పారు. అయితే, తమ కలయికపై ఎలాంటి అపోహలు లేకుండా... అందరికీ ముందుగానే సమాచారం ఇచ్చి కలుస్తానని అన్నారు.