అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. వారం రోజుల వ్యవధిలో మూడో ఘటన

  • కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు
  • శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి మృతికి సంతాపం తెలిపిన భారత రాయబార కార్యాలయం
  • ఆయన కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. వరుసగా సంభవిస్తున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయిన స్థితిలో కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థులు చనిపోవడం ఈ వారంలో ఇది మూడోసారి. శ్రేయాస్‌రెడ్డి మరణానికి కారణం తెలియాల్సి ఉంది. 

శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. కాగా, ఈ వారంలో వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా మరణించారు. శ్రేయాస్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News