అమెరికాలో వేగంగా వ్యాపిస్తోన్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ 'కాండిడా ఆరిస్'
- ఈ నెలలో వాషింగ్టన్‌లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ
- మరణాల రేటు అధికంగా ఉందని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
- 15 ఏళ్లక్రితం జపాన్‌లో తొలిసారి కేసుల గుర్తింపు.. క్రమంగా పెరుగుతున్న కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్’ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. జనవరి నెలలో వాషింగ్టన్ రాష్ట్రంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇన్ఫెక్షన్ అరుదైనదే అయినప్పటికీ అత్యంత హానికరమైనదని వైద్య నిపుణులు హెచ్చరించారు. మరణాల రేటు అధికమని, దీని చికిత్సలో ఔషధాల ప్రభావం తక్కువగా ఉండడం, వైద్యవ్యవస్థ సౌకర్యాల ద్వారా సులభంగా వ్యాప్తి చెందగల లక్షణాలు ఉండడంతో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమని వైద్య నిపుణులు అప్రమత్తత ప్రకటించారు.
ఈ ఏడాది ‘క్యాండిడా ఆరిస్’ మొదటి కేసు జనవరి 10న నిర్ధారణ అయ్యింది. గతవారం మూడు కేసులు పాజిటివ్‌గా తేలినట్టు ‘సియాటెల్ అండ్ కింగ్ కౌంటీ’ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గత మంగళవారం ప్రకటించింది.
ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులకు సోకుతోందని, పలు ప్రభావవంత యాంటీ ఫంగల్ మందులు దీని చికిత్సలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాని వైద్య నిపుణులు చెబుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.
హాస్పిటల్స్‌లో ఫీడింగ్ ట్యూబ్‌లు, బ్రీతింగ్ ట్యూబ్‌లు ఉపయోగించే రోగులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టు గుర్తించారు. శరీరంలో రక్తప్రవాహం, గాయాలు, చెవులు వంటి వివిధ శరీర భాగాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని అమెరికా హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) రిపోర్ట్ పేర్కొంది. సోకిన ప్రదేశాన్ని బట్టి తీవ్ర ఉంటోందని వివరించింది.
కాగా 15 సంవత్సరాల క్రితం జపాన్‌లో ‘కాండిడా ఆరిస్’ కేసులు తొలిసారి నమోదయాయి. ఆ తర్వాతి కాలంలో అవి విపరీతంగా పెరిగిపోయాయి. 2016లో 53 మందికి, 2021లో 1,471 మందికి, 2022లో 2,377 మందికి ఈ ఫంగస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కేసు నమోదయాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఈ ఫంగస్‌ను పెరుగుతున్న ముప్పుగా గుర్తించింది.