నటుడు విజయ్ కొత్త పార్టీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్

  • ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్‌ 
  • విమానాశ్రయంలో విజయ్ పార్టీపై స్పందించాలని అడిగిన మీడియా ప్రతినిధులు
  • కంగ్రాట్స్... కంగ్రాట్స్ అంటూ స్పందించిన రజనీకాంత్
నటుడు విజయ్ కొత్త పార్టీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయ్ ఇటీవల తమిఝగ వెట్రి కజగం పేరుతో తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. విజయ్‌కి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ కూడా విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలో నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విమానాశ్రయంలో దిగిన రజనీకాంత్‌ను మీడియా ప్రతినిధులు విజయ్ కొత్త పార్టీ గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన రజనీకాంత్ ఆయనకి కంగ్రాట్స్ చెబుతున్నానని పేర్కొన్నారు. రెండుసార్లు కంగ్రాట్స్... కంగ్రాట్స్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


More Telugu News