విమానం గాల్లో ఉండగా ఊడిపడ్డ డోర్
- అమెరికాలోని న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన
- బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సమీపిస్తున్న సమయంలో ఊడిన చిన్న విమానం డోర్
- సురక్షితంగా ల్యాండింగ్, విమానంలోని ఇద్దరు సురక్షితం
అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన నమోదయింది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం చేరువవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది.
కాగా డోర్ కోసం అన్వేషించగా జాడ దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్అర్బన్ పోలీసులు తెలిపారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని వివరించారు. డోర్ పడిన కారణంగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో డోర్ ఊడిపడిందని వివరించారు. ఈ విమానం ఎయిర్‌పోర్టుకు దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరం ప్రయాణించిందని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.