నేను లవ్ చేసింది ఆ హీరోయిన్ ను కాదు: సందీప్ కిషన్

  • వీఐ ఆనంద్ నుంచి 'ఊరుపేరు భైరవకోన'
  • ఈ నెల 16వ తేదీన సినిమా విడుదల
  • తన లవ్ మేటర్ చెప్పిన సందీప్ కిషన్
  • రెజీనా ఫ్రెండ్ మాత్రమేనని వెల్లడి   

నేను లవ్ చేసింది ఆ హీరోయిన్ ను కాదు: సందీప్ కిషన్
సందీప్ కిషన్  హీరోగా 'ఊరు పేరు భైరవకోన' సినిమా రూపొందింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సందీప్ బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా గురించి .. తన గురించిన అనేక విషయాలను పంచుకున్నాడు.

ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా చూసుకోవడానికిగాను కొత్త కథలను .. పాత్రలను ఎంచుకుంటున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాను. అలా చేసిన సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాకి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందనే నేను భావిస్తున్నాను" అన్నాడు. 

"ఎక్కడికి వెళ్లినా నా లవ్ స్టోరీస్ గురించే అడుగుతున్నారు. రెజీనాకి నేను బర్త్ డే విషెస్ చెబితే చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆమె .. నేను చాలా కాలంగా ఫ్రెండ్స్ అంతే. ఇద్దరం కలిసి నటించడం వలన అలాంటి పుకార్లు పుట్టాయేమో కూడా. ఇండస్ట్రీకి చెందినవాళ్లతో నేను రెండు మూడు సార్లు లవ్ లో పడటం .. బ్రేకప్ కావడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కెరియర్ పైనే దృష్టి పెట్టాను" అని చెప్పాడు. 



More Telugu News