కాంగ్రెస్ నేతలతో భేటీ అంటూ ప్రచారం... తీవ్రంగా స్పందించిన ఈటల రాజేందర్

  • కాంగ్రెస్ నేతలతో ఈటల మాట్లాడుతున్న ఫొటో వైరల్
  • భేటీ వార్తలను ఖండించిన ఈటల రాజేందర్
  • బీజేపీ కార్పోరేటర్ గృహప్రవేశానికి హాజరై అందరితో కలిసి మాట్లాడానని వివరణ
కాంగ్రెస్ నేతలతో భేటీ అంటూ ప్రచారం... తీవ్రంగా స్పందించిన ఈటల రాజేందర్
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఆయన శనివారం తీవ్రంగా ఖండించారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ కార్పోరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశానికి తాను హాజరయ్యానని... ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారని తెలిపారు. ఈ సమయంలో వారితో కలిసి తాను భోజనం చేసినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతలతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదన్నారు. ఆ కార్యక్రమంలో అందరితో కలిసి మాట్లాడాను... అందరితో కలిసి భోజనం చేశానని స్పష్టం చేశారు. కానీ ఫొటోపై దుష్ప్రచారం సరికాదన్నారు.


More Telugu News