నా తొలి బ్యాట్ అదే.. సోదరి బహుమతిగా ఇచ్చింది: సచిన్ టెండూల్కర్
- కశ్మీర్‌లో కుటుంబంతో పర్యటిస్తున్న సచిన్
- విల్లో బ్యాట్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన వైనం
- పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సచిన్
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన కుటుంబం సహా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. కశ్మీర్‌లో మాత్రమే లభించే విల్లో చెట్టు టేకుతో తయారు చేసిన బ్యాట్లను ఆయన పరిశీలించారు. బ్యాట్ నాణ్యత.. బ్యాట్ తయారీ కేంద్రం వారితో చర్చించారు.
తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో చేసిందేనని, తన సోదరి ఆ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌కు వచ్చాక విల్లో బ్యాట్లను చూడకుండా వెళ్లడం కుదురుతుందా అని చమత్కరించారు. కాగా, తనకు నచ్చిన బ్యాట్లలో గ్రెయిన్స్ (చెక్క వయసు తెలిపే ముదురు గోధుమ రంగు చారలు) 5 లేదా 6 ఉండేవని సచిన్ గుర్తు చేసుకున్నారు. కొందరు 10 లేదా 11 గ్రెయన్స్ ఉన్న బ్యాట్లు కూడా వాడేవారని సచిన్ చెప్పుకొచ్చారు.
విల్లో బ్యాట్లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
కశ్మీర్‌లో మాత్రమే లభ్యమయ్యే విల్లో టేకుతో చేసీ ఈ బ్యాట్లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. మంచి నాణ్యత, సుదీర్ఘకాలం పాటు మన్నే లక్షణం వీటి సొంతం. కాస్తంత బరువు తక్కువగా ఉండే ఆ బ్యాట్‌తో బంతిని బలంగా బాదేయచ్చని బ్యాటర్స్ చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్స్ ఈ బ్యాట్స్‌ను ఇష్టపడతారు. కశ్మీర్ నేల, పర్యావరణం కారణంగా విల్లో టేకు పలు ప్రత్యేకతలు సంతరించుకుంటుంది.