లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ పొత్తు: నోరు జారిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

  • వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన యశస్వినిరెడ్డి
  • చేరికల వల్ల మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి నష్టం జరగదని హామీ
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నోరు జారారు! రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు ఉందంటూ టంగ్ స్లిప్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనిపించదన్నారు. చేరికల వల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ... 'ఇక బీజేపీ వాళ్లు అంటారా... వాళ్లతోనే ఇప్పుడు పొత్తు...' అని వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న ఓ నాయకుడు సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేయడంతో... బీఆర్ఎస్‌కు, బీజేపీకి పొత్తు అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే.


More Telugu News