బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్‌లోకి ఆహ్వానం
- బీజేపీలో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి
- ఈ సీటును డీకే అరుణకు కేటాయించిన బీజేపీ
- త్వరలో కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ టిక్కెట్‌ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించారు. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి... కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆయన షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణకు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు.