పిఠాపురం బరిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌పై పోటీ!

  • సడెన్‌గా నిర్ణయం తీసుకున్నానన్న వివాదాస్పద దర్శకుడు
  • ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించిన ఆర్జీవీ
  • పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ పవన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్జీవీ ట్వీట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయం తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని వ్యాఖ్యానించారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్బీవీ ఎక్స్ వేదికగా ఈ విధంగా స్పందించారు. మరి ఆర్బీవీ నిజంగానే పవన్ కల్యాణ్‌పై పోటీ చేయబోతున్నారా? లేక వ్యంగ్యంగా అలా అన్నారా? అనేది వేచిచూడాల్సి ఉంది.


More Telugu News