సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 327 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ
- ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తుల ఆహ్వానం
- ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తామని వెల్లడి
ప్రభుత్వరంగ బొగ్గు మైనింగ్ సంస్థ సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు కేటగిరీల్లోని 327 పోస్టుల నియామకానికి సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఈ2 (ఈఅండ్‌ఎం) గ్రేడ్- 42, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఈ2 (సిస్టమ్స్) గ్రేడ్- 7 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్‌ఎస్ గ్రేడ్ సీ- 100, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ సీ- 9, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ సీ- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1- 98 భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది.
అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనునున్నట్టు సింగరేణి వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని సీఎండీ బలరాం సూచించారు.
అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనునున్నట్టు సింగరేణి వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని సీఎండీ బలరాం సూచించారు.