ఎలక్టోరల్ బాండ్స్‌తో నిధులు స్వీకరించని మూడు పార్టీలు ఇవే!
- ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు స్వీకరించని లెఫ్ట్ పార్టీలు
- సుప్రీం ఆదేశాల మేరకు ఈసీ బహిరంగ పరిచిన ఎన్నికల బాండ్ల వివరాల్లో వెల్లడి
- తాము తొలి నుంచీ ఎన్నికల బాండ్లను వ్యతిరేకించినట్టు ఈసీకి లేఖ రాసిన సీపీఐ(ఎమ్)
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తాము నిధులు తీసుకోలేదని మూడు లెఫ్ట్ పార్టీలు సీసీఐ(ఎమ్), సీపీఐ, సీపీఐ(ఎమ్ఎల్) గతేడాదే ఈసీకి తెలియజేశాయి. ఈసీ తాజాగా బయటపెట్టిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది.
ఎలక్టోరల్ బాండ్స్‌కు తాము వ్యతిరేకమంటూ సీపీఐ(ఎమ్) ఈసీకి గతేడాది లేఖ రాసింది. ఎలక్టోరల్ బాండ్స్ ప్రకటించిన నాటి నుంచీ తాము ఈ స్కీమ్‌ను వ్యతిరేకించినట్టు సీపీఐ(ఎమ్) ఈసీకి తెలియజేసింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎటువంటి నిధులు స్వీకరించొద్దని తాము నిర్ణయించినట్టు తెలిపింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సుప్రీం కోర్టులో ఎలక్టోరల్ బాండ్స్‌ను వ్యతిరేకిస్తూ పెండింగ్‌లో ఉన్న మూడు పిటిషన్లలో ఒకటి తమదేనన్న విషయాన్ని కూడా సీపీఐ(ఎమ్) తన లేఖలో ప్రస్తావించింది. ఈ లేఖపై పార్టీ అధ్యక్షుడు సీతారాం ఏచూరి సంతకం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గతం చేసిన ఈసీ..ఈ లేఖను కూడా బయటపెట్టింది.