తెలంగాణకు ఏం చేశారు?: కాంగ్రెస్, బీజేపీలపై మల్లారెడ్డి ఆగ్రహం
- రెండు జాతీయ పార్టీలకూ తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్న మల్లారెడ్డి
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? అని మండిపాటు
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలతో మండిపడ్డారు. బుధవారం ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని... కానీ తెలంగాణకు వారు చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. రెండు జాతీయ పార్టీలకూ తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారో చెప్పాలన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయన్నారు.