కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు వెళ్తున్న తొలి సీఎం కేజ్రీవాల్

  • కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • కాసేపట్లో తీహార్ జైలుకు కేజ్రీవాల్ తరలింపు
  • మార్చ్ 22న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు (14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో, ఆయనను ఈరోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను కాసేపట్లో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత నెల 22న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News