ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డికి అసోంలో బాధ్యతలు

  • అసోంలో ఎన్నిక‌ల పోలీసు అబ్జ‌ర్వ‌ర్‌గా విధులు
  • రాజ‌ధాని భూముల‌పై వేసిన 'సిట్‌'కు ఆయ‌నే హెడ్‌
  • స్కిల్ కేసులో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబును అరెస్టు చేసిన ర‌ఘురామ్ రెడ్డి 
  • ర‌ఘురామ్ రెడ్డి చేతుల్లోనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 
ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డికి అసోంలో బాధ్యతలు
ఐపీఎస్ అధికారి కొల్లి ర‌ఘురామ్ రెడ్డిని ఎన్నిక‌ల క‌మిష‌న్ అసోంలో ఎన్నిక‌ల పోలీసు అబ్జ‌ర్వ‌ర్‌గా నియ‌మించింది. సోమ‌వారం సాయంత్రం ఈ ఆదేశాలు వెలువ‌డ్డాయి. ఇక గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ఎల‌క్ష‌న్స్‌ల్లో సాధార‌ణ ప‌రిశీల‌కులు, వ్య‌య ప‌రిశీల‌కులు మాత్ర‌మే ఉండేవారు. కానీ, ఈ ఎన్నిక‌ల‌ను మ‌రింత బందోబ‌స్తుగా నిర్వ‌హించాల‌నే ఉద్దేశంతో ఎన్నిక‌ల సంఘం 'పోలీసు అబ్జ‌ర్వ‌ర్'ను కూడా నియ‌మించింది. దీనిలో భాగంగా రాష్ట్రానికి చెందిన ప‌లువురు అధికారులను ఇత‌ర రాష్ట్రాల‌కు ప‌రిశీల‌కులుగా పంపించ‌డం జ‌రుగుతోంది. 

ఇలాగే కొల్లి ర‌ఘురామ్ రెడ్డికి అసోంలోని 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలీసు అబ్జ‌ర్వ‌ర్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింది. దీంతో ఆయ‌న రాష్ట్ర రాజ‌ధాని గువాహ‌టి కేంద్రంగా ఉండి విధులు నిర్వ‌హించ‌నున్నారు. ఇక జ‌గ‌న్ అధికారంలోకి రాగానే కొల్లిని రాజ‌ధాని భూముల‌పై వేసిన సిట్‌కు అధిపతిగా ‌నియమించారు. స్కిల్ కేసులో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును అరెస్టు చేసిన అధికారి కూడా ఈయ‌నే.

ఇక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ర‌ఘురామ్ రెడ్డి చేతుల్లోనే ఉంది. అలాగే ఆయ‌న‌ను ఔష‌ధ నియంత్ర‌ణ మండ‌లి డీజీగా కూడా నియ‌మించ‌డం జ‌రిగింది. ఇటీవ‌ల మాజీ మంత్రి పి.నారాయ‌ణ క‌ళాశాల‌, నివాసంపై ఆ హోదాలోనే త‌నిఖీలు జ‌రిపించారాయ‌న‌. ఇప్పుడు ఉన్న‌ట్టుండి కొల్లి ర‌ఘురామ్ రెడ్డిని వేరే రాష్ట్రానికి పంపించ‌డం జ‌రిగింది.


More Telugu News