జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తా: న‌వ‌దీప్‌

  • ల‌వ్ మౌళి మూవీ ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవ‌ల్లభుడిని ద‌ర్శించుకున్న న‌వ‌దీప్‌
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తాన‌ని వెల్ల‌డి
  • నిజాయతీగా ఎవ‌రు పోటి చేసినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌న్న టాలీవుడ్ హీరో
జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తా: న‌వ‌దీప్‌
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. బీజేపీ-టీడీపీతో జ‌త‌క‌ట్టిన జ‌న‌సేన‌.. 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీకి దిగింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ నుంచి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు ప‌వ‌న్ ఇటీవ‌ల‌ స్టార్‌ క్యాంపెయిన‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్ట‌ర్‌ జానీ మాస్టర్, సినిమా హీరో సాగర్, పృథ్విరాజ్, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు.  

ఈ నేపథ్యంలో జ‌న‌సేనానికి త‌న మ‌ద్ద‌తు తెలుపుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తాన‌ని న‌వ‌దీప్ తెలిపారు. ఆయ‌న‌ పిఠాపురంలోని శ్రీపాద వ‌ల్ల‌భ మ‌హాసంస్థానాన్ని బుధ‌వారం సంద‌ర్శించారు. తాను న‌టించిన‌ 'ల‌వ్ మౌళి' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా శ్రీపాద‌వ‌ల్ల‌భుడి ఆల‌యంలో న‌వ‌దీప్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా న‌వ‌దీప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవ‌రు పోటీ చేసినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని చెప్పారు. ప‌వ‌న్‌కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. ల‌వ్ మౌళి సినిమా ట్రైల‌ర్ విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, హైద‌రాబాద్‌, కాకినాడ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుందని, ప్రేక్ష‌కుల రెస్పాన్స్ తెలుసుకునేందుకు ప‌ర్య‌టిస్తున్న‌ట్లు చెప్పారు. స‌రికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌న్నారు. ఓ భిన్న‌మైన ప్రేమక‌థ‌తో వ‌స్తున్న ఈ మూవీలో న‌వ‌దీప్ స‌ర‌స‌న గిద్వానీ, భావ‌న్ హీరోయిన్లుగా న‌టించారు.


More Telugu News