లక్షద్యీప్ లో బ్రాంచి తెరిచిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఇదే!
- భారత్ లో ప్రైవేటు రంగంలో నెంబర్ వన్ బ్యాంక్ గా హెచ్ డీఎఫ్ సీ
- లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్ డీఎఫ్ ఎసీ బ్యాంకు ఏర్పాటు
- ఈ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల వృద్ధి లక్ష్యమని వెల్లడి
లక్షద్వీప్... భారత్ కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం. ఇటీవల మాల్దీవుల రగడ నేపథ్యంలో లక్షద్వీప్ కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా లక్షద్వీప్ లో టూరిజంను ప్రోత్సహిస్తూ చేసిన ప్రకటనలు ఫలించాయి. ఈ చిన్న దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇక అసలు విషయానికొస్తే... ఇప్పటివరకు లక్షద్వీప్ లో ఒక్క ప్రైవేటు బ్యాంకు కూడా లేదు. ఇప్పుడా పరిస్థితి మారింది. దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంక్ గా కొనసాగుతున్న హెచ్ డీఎఫ్ సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లో కాలుమోపింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్ డీఎఫ్ సీ తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్ లో ఇప్పటివరకు ఏర్పాటైన తొలి ప్రైవేటు బ్యాంకు ఇదే.
ఈ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం, పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్ డీఎఫ్ సీ పేర్కొంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఇప్పటికే కశ్మీర్ లోయలోనూ, కన్యాకుమారిలోనూ బ్రాంచిలు కలిగి ఉంది.