ముంబై ఇండియన్స్ విజయంపై సచిన్ ట్వీట్.. అన్నిటికంటే అదే గొప్పగా ఉందని కామెంట్!
- హ్యాట్రిక్ ఓటముల తర్వాత సమష్టిగా రాణించి విజయం సాధించడం అద్భుతమన్న లిటిల్ మాస్టర్
- జస్ప్రీత్ బుమ్రా మరోసారి సత్తాచాటాడన్న సచిన్
- పవర్ ప్లేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడారని ప్రశంస
- సూర్యకుమార్ భారీ హిట్టింగ్ సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్య
- హార్ధిక్ పాండ్యా మ్యాచ్‌ను ముగించిన తీరు అన్నిటికంటే గొప్పగా ఉందంటూ సచిన్ ట్వీట్
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే ముంబై ఇండియన్స్‌ను వరుస పరాజయాలు పలకరించాయి. అయితే, హ్యాట్రిక్ ఓటముల అనంతరం ముంబై జట్టు కోలుకుంది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. ఇక గురువారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో అయితే ఎంఐ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుస విజయాలు నమోదు చేయడంపై ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు.
ఆర్‌సీబీపై సమష్టిగా రాణించి విజయం సాధించడం అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసించాడు. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు సాధించడం, ముంబై ఓపెనర్లు శతక భాగస్వామ్యం అందించడం, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనపై సచిన్ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు.
"వరుస పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు.. బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సత్తాచాటాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి మంచి ఆరంభం ఇచ్చారు. సూర్యకుమార్ గాయం తర్వాత కోలుకుని తిరిగి వచ్చి ఈ విధంగా భారీ హిట్టింగ్ చేయడం సంతోషాన్నిచ్చింది. ఇక కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మ్యాచ్‌ను ముగించిన తీరు అన్నిటికంటే గొప్పగా ఉంది" అని సచిన్ ట్వీట్ చేశాడు.