పిల్లల స్కూలు ఫీజు డబ్బులతో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన ధోనీ వీరాభిమాని.. తలంటుతున్న నెటిజన్లు!
- ధోనీ వీరాభిమాని ఘన కార్యం
- స్టేడియంలోనే విషయాన్ని ఆనందంగా పంచుకున్న అభిమాని
- ఇదేం పిచ్చిపనంటూ నెటిజన్ల మండిపాటు
క్రికెట్ అంటే వెర్రెత్తిపోయేవాళ్లు ఉన్నారన్న మాట నిజమే కానీ, ఇది అంతకుమించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ ఆటను వీక్షించేందుకు ఓ వీరాభిమాని చేసిన పనికి అందరూ చీవాట్లు పెడుతున్నారు. ఈ నెల 8న చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్లతో విజయం సాధించింది.
ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలని ఉబలాటపడిన అభిమాని రూ. 64 వేలతో బ్లాక్‌లో టికెట్లు కొని మరీ వీక్షించి ఉబలాటం తీర్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. స్టేడియంలో అతడు స్పోర్ట్స్ వాక్ చెన్నై చానల్‌తో మాట్లాడుతూ తన పిల్లలకు స్కూలు ఫీజు కట్టేందుకు ఉంచిన రూ. 64 వేలతో బ్లాక్‌లో టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశానని సంబరపడిపోతూ చెప్పాడు.
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతూ చీవాట్లు పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా ఇదేం పిచ్చిపనంటూ మండిపడ్డారు.