అది భద్రతా వైఫల్యం అని సజ్జల మాటలను బట్టి అర్థమవుతోంది: భానుప్రకాశ్ రెడ్డి

  • అప్పుడు కోడికత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారన్న భానుప్రకాశ్ రెడ్డి
  • రాజకీయాల్లో శత్రువులు ఉండరని వ్యాఖ్య
  • డీజీపీ, డీఐజీ సీఎంకే భద్రత కల్పించలేకపోయారని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడారని... ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చే సమయానికి వింత వింత సంఘటనలను మనం చూస్తామని చెప్పారు. గులకరాయి ఘటనపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని, శత్రువులు ఉండరని భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగిందని సకలశాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని... అంటే ఇది భద్రతా వైఫల్యం అనే విషయం అర్థమవుతోందని అన్నారు. సీఎంపై దాడి జరుగుతుంటే డీజీపీ, డీఐజీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంకే భద్రత కల్పించలేని వారు... ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ఎద్దేవా చేశారు. తప్పు వారివైపు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News