ఎల్లుండి హైదరాబాద్‌కు కేంద్రమంత్రులు, గోవా ముఖ్యమంత్రి
- రఘునందన్ రావు తరఫున మెదక్‌లో ప్రచారంలో పాల్గొననున్న గోవా ముఖ్యమంత్రి
- ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
- కిషన్ రెడ్డి నామినేషన్ పర్వంలో పాల్గొననున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
ఈ నెల 18న రాష్ట్రానికి పలువురు కేంద్రమంత్రులు వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం హైదరాబాద్ రానున్నారు.
మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి గోవా ముఖ్యమంత్రి సావంత్ ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లుండి ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ర్యాలీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ పాల్గొంటారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈటల రాజేందర్‌కు మద్దతుగా పలు సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ నెల 19న కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.