వ్యూహం మార్చిన సమాజ్‌వాదీ పార్టీ.. కన్నౌజ్ నుంచి లోక్‌సభ బరిలోకి అఖిలేశ్ యాదవ్

  • ఇప్పటికే ఈ స్థానానికి అఖిలేశ్ మేనల్లుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ పేరు ప్రకటన
  • ఇప్పుడాయనను పక్కనపెట్టి బరిలోకి దిగిన పార్టీ చీఫ్
  • తేజ్ ప్రతాప్ కంటే అఖిలేశ్ బెటర్ ఆప్షన్ అన్న పార్టీ సీనియర్ నేత
చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం మార్చినట్టే కనిపిస్తోంది. గత సంప్రదాయానికి భిన్నంగా ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. ఈ నెల 12న ఇదే స్థానానికి మేనల్లుడు తేజ్‌ప్రతాప్ సింగ్ యాదవ్‌ పేరును ప్రకటించారు. 

ఇప్పుడు అనూహ్యంగా ఆయనను మార్చేసి అక్కడి నుంచి అఖిలేశ్ బరిలోకి దిగారు. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతోనే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ తెలిపింది.

గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి డింపుల్ యాదవ్ పోటీచేశారు. ఈసారి తేజ్ ప్రతాప్‌ను ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వం సరైనదే అయినప్పటికీ అఖిలేశ్ యాదవ్ అంతకుమించిన ఆప్షన్ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.


More Telugu News