భర్త లేని సమయంలో మరిది అత్యాచారం.. విషయం చెప్పిన భార్యపై భర్త హత్యాయత్నం

  • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో దారుణం
  • చున్నీతో ఉరి బిగించి చంపాలని చూశాడంటూ బాధితురాలి ఫిర్యాదు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
భర్త లేని సమయంలో మరిది అత్యాచారం.. విషయం చెప్పిన భార్యపై భర్త హత్యాయత్నం
భర్త ఊళ్లో లేని సమయంలో మరిది అఘాయిత్యం చేశాడు.. తిరిగి వచ్చిన భర్తకు విషయం చెప్పుకుని ఏడ్చిందా భార్య.. తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన ఆ భర్త మాత్రం తన భార్యనే తుదముట్టించేందుకు ప్రయత్నించాడు. తమ్ముడు ఫోన్ లో వీడియో తీస్తుండగా భార్య మెడకు చున్నీ బిగించి చంపాలని చూశాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుందీ దారుణం.

అసలు ఏం జరిగిందంటే..
ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళపై ఈ నెల 2న అత్యాచారం జరిగింది. ఆమె భర్త ఊళ్లో లేని సమయం చూసి భర్త సోదరుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిస్సహాయంగా మిగిలిపోయిన బాధితురాలిపై పడి తన పశువాంఛ తీర్చుకున్నాడు. ఊరెళ్లిన భర్త ఇంటికి తిరిగొచ్చాక విషయం చెప్పి కన్నీరుపెట్టుకుందా బాధితురాలు. అయితే, భార్య చెప్పింది విన్న ఆ ప్రబుద్ధుడు ‘నువ్వు ఇక నా భార్యవు కాదు. నా తమ్ముడు నీపై అత్యాచారం చేశాడు కాబట్టి ఇకపై నువ్వు నా మరదలువు’ అంటూ పిచ్చి కూతలు కూశాడు. ఆ మరుసటి రోజు తన తమ్ముడితో కలిసి వచ్చి భార్యను చంపేందుకు ప్రయత్నించాడు.

బాధితురాలిపై కూర్చుని మెడకు చున్నీ బిగించి చంపాలని చూశాడు. బాధితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి దీనిని తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్న బాధితురాలు.. సెల్ ఫోన్ తో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై జరిగిన ఘోరాన్ని, కట్టుకున్నవాడే తనను కడతేర్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, హత్య కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News