ఒకటి, రెండు, మూడు రోజులు కాదు.. లక్షల ఏళ్లపాటు ఆగని వాన!
- 23 లక్షల ఏళ్ల క్రితం భూమ్మీద ఖండాలు ఏర్పడని కాలంలో వాన
- అప్పట్లో భూమి అంతా ఒకవైపు, సముద్రం మరోవైపు
- విపరీతమైన వేడి కారణంగా సముద్రపు నీరు ఆవిరి
- వాతావరణంలో తేమ నిండిపోయి ప్రారంభమైన వాన
- 20 లక్షల ఏళ్లపాటు ఆగకుండా కురిసిన వర్షం
వాన కోసం ఎదురుచూడని ప్రాణి ఈ ప్రకృతిలో ఉండదనడం అతిశయోక్తి కాదు. జలంలోనే జీవి మనుగడ దాగి ఉంది. అందుకనే మేఘాలు కమ్ముకుంటే, వాన పడితే మేని పులకరించిపోతుంది. వాన ఎంత ఆనందం తెచ్చినా అది ఒకటి రెండురోజులే. ఆ తర్వాత మాత్రం చిరాకు తెప్పిస్తుంది. ఇక ఆగిపోతే బాగుండును.. అని వరుణుడిని ప్రార్థిస్తారు. ఒకటి రెండు రోజులకే విసుగు తెప్పించే వాన రోజుల తరబడి కురిస్తే.. అది సంవత్సరాల తరబడి కొనసాగితే.. లక్షల ఏళ్లపాటు ఎడతెరిపి లేకుండా పడితే.. నమ్మశక్యం కాకుండా ఉంది కదూ.
అయినా ఇది నిజం. ఒకసారి ప్రారంభమైన వాన 20 లక్షల ఏళ్లపాటు ఒక రోజు కూడా విరామం లేకుండా కురిసింది. అయితే, ఇది ఇప్పుడు జరిగింది కాదు. 23 లక్షల ఏళ్ల క్రితం భూమ్మీద ఖండాలు ఏర్పడని కాలంలో ఈ వాన కుమ్మేసింది. ఒకసారి ప్రారంభమైన వాన లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఖండాలు లేని అప్పట్లో భూ ప్రాంతమంతా ఒకచోట.. సముద్రమంతా ఒకచోట ఉండేది. విపరీతమైన వేడి కారణంగా సముద్రపు నీరు ఆవిరైపోయి వాతావరణంలో తేమ నిండిపోయింది. అది అలా పెరిగిపెరిగి వాన కురవడం మొదలైంది. అలా మొదలైన వాన లక్షల ఏళ్లపాటు కురిసింది.