వంగవీటి రాధా ఏదీ అడగడు: దెందులూరు సభలో చంద్రబాబు
- ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, వంగవీటి రాధా
- పార్టీ కోసం రాధా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడన్న చంద్రబాబు
- రాధా తండ్రి పేరును అడ్డంపెట్టుకునే వ్యక్తి కాదని కితాబు
- రాధా సేవలు రాష్ట్రానికి అవసరం అని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో చింతమనేని ప్రభాకర్, వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"నేను చాలామందిని చూశాను. కానీ ప్రజలకు సిన్సియర్ గా ఏదో చేయాలనే తపన ఉన్న నాయకుడు రాధాకృష్ణ. ఏమీ కోరడు... మామూలుగా అయితే చాలామంది తండ్రి పేరు అడ్డంపెట్టుకుని పదవులు ఆశిస్తారు. రాధాకృష్ణ మాత్రం నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. రాధాకృష్ణ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళుతున్నాడు... దూసుకుపోతున్నాడు.
తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తనను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకూడదని నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు వంగవీటి రాధాకృష్ణ. ఈ దెందులూరులో ఇవాళ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రానికి రాధాకృష్ణ సేవలు అవసరం. ఆయనకు తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాది" అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు.