ఉస్మానియా ఘటన... బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మెస్‌ల మూసివేతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓయూ అధికారుల ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- కొత్తగూడెం వెళుతుండగా పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకీ తీసుకున్న పోలీసులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళుతుండగా పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రతి సంవత్సరం మెస్‌ల మూసివేత, సెలవులపై ప్రకటన చేస్తుంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఈ మూసివేతపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని... తద్వారా విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.