ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదు: సజ్జల
- ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రగడ
- ఇది భూములను కాపాడే చట్టం అని సజ్జల వెల్లడి
- కానీ దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని ఆగ్రహం
- ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టీకరణ
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నువ్వు ఎలాగూ ఇలాంటి చట్టాలు తీసుకురాలేవు, ఎవరైనా తీసుకొస్తే నువ్వు హర్షించవు. నీ విషపూరితమైన ఆలోచనలతో, నీకున్న పచ్చ మీడియా బలంతో, ఇలాంటి ప్రచారాలు చేయగలిగిన శక్తుల అండతో దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని దుష్ప్రచారం సాగిస్తున్నావు" అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, ఇది ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టంతో ల్యాండ్ గ్రాబింగ్ కు అవకాశం ఉండేదని, దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నది చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులేనని సజ్జల ఆరోపించారు. సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో కాజేశారని, మళ్లీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఇలాంటి వాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
ఈ విధానంలో సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటున్నారని, మనిషి అన్నాక రోగాలు లేకపోవడం తప్పు అన్నట్టుగా వీళ్ల వాదనలు ఉన్నాయని అన్నారు. ఆయన (చంద్రబాబు) లాగా అందరికీ రోగాలు ఉండాలంటే ఎలా? అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు.