నటి అవికా గోర్ తో కలిసి చిందేసిన కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రే రస్సెల్!
- బాలీవుడ్ లో తెరంగేట్రం చేయనున్న వెస్టిండీస్ స్టార్
- ‘లడ్ కీ తు కమాల్ కీ’ పేరుతో హుషారైన పాటకు డ్యాన్స్
- మే 9న విడుదల కానున్న మ్యూజిక్ వీడియో
వెరైటీ హెయిర్ స్టైల్, అసాధారణ బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన వెస్టిండీస్ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా మరో అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ మ్యూజిక్ వీడియోతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేయనున్నాడు. ‘లడ్ కీ తూ కమాల్ కీ’ అంటూ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఉయ్యాలా జంపాలా ఫేం అవికా గోర్ తో కలసి రస్సెల్ ఆడిపాడిన ఈ మ్యూజిక్ వీడియో టీజర్ తాజాగా విడుదలై నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అందులో రస్సెల్ రంగు కళ్లద్దాలు, నల్ల బనీన్, దానిపై గజిబిజి అక్షరాలతో ఫుల్ హ్యాండ్ షర్ట్, లుంగీ ధరించి చిందులేయడం కనిపించింది. ఈ వీడియో మే 9 న విడుదల కానుంది. రస్సెల్ డ్యాన్స్ వీడియో టీజర్ చూసిన నెటిజన్లు అతని డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.
ఆండ్రీ రస్సెల్ ‘ఫ్యాషనిస్టా’ అంటూ కేకేఆర్ ఫ్రాంచైజీ కో ఓనర్ అయిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కితాబునిచ్చాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షారూఖ్ మాట్లాడుతూ రస్సెల్ ఎప్పుడూ లెటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటాడని చెప్పాడు. వెరైటీగా ఉండే కొత్తకొత్త డ్రెస్ లు ధరిస్తాడని, జట్టును కూడా రకరకాల షేప్ లలో డిజైన్ చేసుకుంటాడని అన్నాడు. వెస్టిండీస్ కు చెందిన మరో క్రికెటర్ క్రిస్ గేల్ తరహాలోనే రస్సెల్ కూడా చాలా సరదాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.
పాకిస్తాన్ క్రికట్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం ఇటీవల ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ ల విచిత్ర వ్యవహార శైలి గురించి తెలియజేశాడు. ఐపీఎల్ లో ఆడుతున్నంత కాలం వాళ్లు రాత్రంతా మేల్కొని పగలు పడుకుంటారని చెప్పాడు. గతంలో తాను కేకేఆర్ జట్టుకు మెంటార్ గా ఉన్నప్పుడు ఈ అంశం గురించి వారిని అడిగానని అక్రమ్ అన్నాడు. అయితే కరీబియన్ దీవులతో పోలిస్తే భారత కాలమాన సమయం దాదాపు 9 గంటల 30 నిమిషాలు ముందు ఉండటం వల్ల భారత్ లో రాత్రుళ్లు తాము పడుకున్నా నిద్ర పట్టదని వారు చెప్పారన్నాడు.