ఓట‌మి భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యారు: వైఎస్ ష‌ర్మిల

  • ఓడితే అరెస్టు త‌ప్ప‌ద‌నే భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఉన్నారన్న ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు  
  • ఒక‌వేళ ఆయ‌న గెలిస్తే నేరం గెలిచిన‌ట్లేన‌ని వ్యాఖ్య‌
  • వాళ్లే సింగిల్ ప్లేయ‌ర్‌గా ఉండాల‌నేది వైఎస్ భార‌తి వ్యూహం అంటూ ష‌ర్మిల ధ్వ‌జం
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌డ‌ప‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఓట‌మి భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యార‌ని, దీనికోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నార‌ని అన్నారు. 

"ఎంపీగా ఓడితే అరెస్టు త‌ప్ప‌ద‌నే భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఒక‌వేళ ఆయ‌న గెలిస్తే నేరం గెలిచిన‌ట్లే. వాళ్లే సింగిల్ ప్లేయ‌ర్‌గా ఉండాల‌నేది వైఎస్ భార‌తి వ్యూహం. గొడ్డ‌లితో మిగ‌తా వాళ్ల‌నూ న‌రికేయండి. అప్పుడు మీరే సింగిల్ ప్లేయ‌ర్ అవుతారు" అని ష‌ర్మిల ధ్వ‌జ‌మెత్తారు. 

కాగా, వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్‌రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే.


More Telugu News