రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి
- రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
- సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను వరించిన అవార్డు
- వేడుకలో పాల్గొన్న చిరంజీవి భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు.