ఐపీఎల్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ న‌యా రికార్డు..!

  • పంజాబ్‌పై 47 బంతుల్లో 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • ఈ క్ర‌మంలో పంజాబ్‌పై 1000 ప‌రుగులు పూర్తి చేసిన ర‌న్ మెషీన్‌
  • ఇప్ప‌టికే ఈ ఫీట్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ల‌పై న‌మోదు చేసిన విరాట్‌
  • ఇలా మూడు ఐపీఎల్ జ‌ట్ల‌పై 1000 ప‌రుగుల మార్క్ అందుకున్న‌ తొలి బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌
ఐపీఎల్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ న‌యా రికార్డు..!
ధ‌ర్మ‌శాల వేదిక‌గా గురువారం పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 60 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆర్‌సీబీ విజ‌యంలో మెరుపు ఇన్నింగ్స్ తో కింగ్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. 47 బంతుల్లోనే కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు బాదాడు. ఈ క్ర‌మంలో పంజాబ్‌పై విరాట్ 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్ప‌టికే ఈ ఫీట్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ల‌పై న‌మోదు చేసిన కోహ్లీ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. ఇలా మూడు ఐపీఎల్ జ‌ట్ల‌పై 1000 ప‌రుగుల మార్క్ అందుకున్న‌ తొలి బ్యాట‌ర్‌గా నిలిచాడు. 

టాప్ ఫామ్‌లో కింగ్ కోహ్లీ!
ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో విరాట్ కోహ్లీ అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులాడిన ర‌న్ మెషీన్ 70.44 స‌గ‌టు, 153.51 స్ట్రైక్ రేటుతో 634 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక శ‌త‌కం, ఐదు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. మొత్తం 30 సిక్స‌ర్లు, 55 ఫోర్లు కొట్టాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ త‌న వ‌ద్దే ఉంచుకున్నాడు. ఇక‌ విరాట్ ఇదే ఫామ్‌ను వ‌చ్చే నెల‌లో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగించాల‌ని ఇండియ‌న్ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.


More Telugu News