ఏపీ ఓటర్లకు సందేశం ఇచ్చిన చంద్రబాబు

  • ఇళ్ల నుంచి కదలాలంటూ ఓటర్లకు పిలుపు
  • ఈరోజు వేసే ఓటు భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని సూచన
  • ఎక్స్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పోలింగ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటర్లకు తన సందేశం ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి’’ అంటూ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా చైతన్యాన్ని నిరూపించాలని ఓటర్లకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.


More Telugu News