జర్మనీ నుంచి బెంగళూరుకు వస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ.. వైరల్ అవుతున్న టికెట్ స్క్రీన్ షాట్
- సెక్స్ టేప్ స్కాండల్ లో అడ్డంగా దొరికిపోయిన ప్రజ్వల్
- మ్యూనిక్ నుంచి బెంగళూరుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రజ్వల్
- ఈ అర్ధరాత్రి బెంగళూరులో ల్యాండ్ అవుతున్న నాన్ స్టాప్ విమానం
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేప్ కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. వారి కుటుంబ పార్టీ జేడీఎస్ లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ భాగోతం బయటపడింది. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో ఉన్నారు. 33 ఏళ్ల ప్రజ్వల్ జర్మనీకి టికెట్ బుక్ చేసుకోవడం వరకు అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
మరోవైపు, ప్రజ్వల్ రేపు బెంగళూరుకు తిరిగి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. జర్మనీలోని మ్యూనిక్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో ఆయన బెంగళూరుకు రానున్నారు. ఇది నాన్ స్టాప్ విమానం. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఈ అర్ధరాత్రి 12.30 గంటలకు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. టికెట్ వివరాల ప్రకారం ప్రజ్వల్ బిజినెస్ క్లాస్ లో బెంగళూరుకు వస్తున్నారు.
జర్మనీకి టికెట్ బుక్ చేసుకున్న రోజునే... ప్రజ్వల్ బెంగళూరుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ ను ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన ముందు రోజున బుక్ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ నెల 1వ తేదీన సోషల్ మీడియా వేదికగా ప్రజ్వల్ స్పందిస్తూ... నేను బెంగళూరులో లేనందువల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. ఇదే విషయాన్ని తన అడ్వొకేట్ ద్వారా సీఐడీకి తెలిపానని చెప్పారు. సత్యం గెలుస్తుందనే విషయం త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు.