బెంగళూరు టైటిల్ గెలవాలంటే.. ఈ ఒక్క పనిచేస్తే చాలు: మహ్మద్ కైఫ్
- ఆర్‌సీబీ భారత ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలన్న భారత మాజీ క్రికెటర్
- ఆ జట్టు ప్రతి సీజన్‌లో విదేశీ ప్లేయర్లపైనే అధికంగా ఆధారపడుతుందని వ్యాఖ్య
- తీరా వారు ఫెయిల్ కావడంతో టోర్నీ విజేతగా నిలవలేకపోతుందన్న కైఫ్
టోర్నీ ప్రారంభానికి ముందు 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ ఊదరగొట్టడం, ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరచడం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) కు పరిపాటిగా మారింది. అయితే, బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే మాత్రం ఒకే ఒక పని చేయాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. అదే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించాలన్నాడు.
ఆ జట్టు ప్రతి సీజన్‌లో విదేశీ ప్లేయర్లపైనే అధికంగా ఆధారపడుతుందని ఈ సందర్భంగా కైఫ్ గుర్తు చేశాడు. తీరా వారు ఫెయిల్ కావడంతో టోర్నీ విజేతగా నిలవలేకపోతుందని తెలిపాడు. బెంగళూరు విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల బలమైన భారత కోర్‌ని నిర్మించడంలో వారు నష్టపోయారని కైఫ్ ఎత్తి చూపాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో కైఫ్ మాట్లాడుతూ.. "ప్రతి సీజన్‌లోనూ ఆర్‌సీబీ విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడుతుంది. వారికే కోట్లు ఖర్చు పెడుతోంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్లు లేకపోయినా ఎలా గెలవాలో ఇప్పుడు వారికి అర్థమైంది. ఇదే వారికి గుణపాఠం కావాలి. భవిష్యత్తులో భారత ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టాలి. అప్పుడే టైటిల్ గెలుస్తుంది" అని తెలిపాడు.
భారత ఆటగాళ్లకు ఆర్‌సీబీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కైఫ్ ఉద్ఘాటించాడు. ఈ సందర్భంగా అతను కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను ఉదహరించాడు. ఈ టీమ్స్ ఐపీఎల్ 2024లో భారతీయ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టడం ద్వారా విజయాన్ని సాధించాయని గుర్తు చేశాడు. కేకేఆర్ భారత ఆటగాళ్లలో పెట్టుబడి పెట్టింది. వారు అగ్రస్థానంలో ఉన్నారు, అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా. ఆర్‌సీబీ భారత ఆటగాళ్లను తీసుకురావాలి' అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
అలాగే బెంగళూరు ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచుల్లో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 13 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి ప్లేఆఫ్ రేసులో ఉంది. ఇదే విషయాన్ని కైఫ్ కూడా ప్రస్తావించాడు.
"వారు వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయారు. ఫస్టాప్‌లో వారి ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. అంటే టోర్నమెంట్‌లో ఒక నెల పాటు వారు గెలుపొందలేదు. అందుకే వారు స్టాండింగ్‌లలో చాలా వెనుకబడి ఉన్నారు. కానీ, ఆ తర్వాత వారి పునరాగమనాన్ని అభినందించాలి. అయితే, ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి" అని కైఫ్ అన్నాడు.