కిర్గిజ్‌స్థాన్‌లో భారత విద్యార్థుల హాస్టళ్ళపై దాడులు... సీఎం రేవంత్ రెడ్డి ఆరా
- కిర్గిజ్‌స్థాన్‌లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు
- గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
- అక్కడ ఉంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
- కిర్గిజ్‌స్థాన్ ఘటనపై అక్కడి రాయబారులతో మాట్లాడిన అధికారులు
కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో గత రెండు మూడు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు.
అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని... అందరూ క్షేమంగానే ఉన్నారని రాయబారి వెల్లడించారు. సోషల్ మీడియా పోస్టుల్లో అసత్య ప్రచారం సాగుతోందని... అందులో వాస్తవం లేదని తెలిపారు. కిర్గిజ్‌స్థాన్‌లో గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం వైరల్‌గా మారడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.