'బచ్చల మల్లి'గా అల్లరి నరేశ్ మాస్ లుక్!

  • లోకల్ రౌడీగా కనిపిస్తున్న లుక్ 
  • తుని నేపథ్యంలో జరిగే కథాకథనాలు
  • దర్శకత్వం వహిస్తున్న సుబ్బు  

'బచ్చల మల్లి'గా అల్లరి నరేశ్ మాస్ లుక్!
అల్లరి నరేశ్ కొత్తగా ఏమేమీ చేయవచ్చునో తెరపై అవి చేసేస్తూ ముందుకు వెళుతున్నాడు. 'నా సామిరంగ'లో ఒక కీలకమైన పాత్రను చేసిన ఆయన, ఆ తరువాత 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ కామెడీకి రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. అలాంటి అల్లరి నరేశ్ ఈ సారి కామెడీకి మాస్ యాక్షన్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అల్లరి నరేశ్ చేస్తున్న ఆ సినిమా పేరే 'బచ్చల మల్లి'. హాస్య మూవీస్ బ్యానర్ రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి అల్లరి నరేశ్ లుక్ ను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

 రిక్షా నడిపే వ్యక్తిగా 'బచ్చల మల్లి' పాత్రలో అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. మెడలో తాయెత్తు .. చేతికి కాశీ దారం .. పొగ తాగుతూ కాస్త కేర్ లెస్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే లోకల్ రౌడీ ట్యాగ్ ఉన్నట్టే అనిపిస్తోంది. వాతావరణం చూస్తుంటే ఇది 1980లలోని కథగా కనిపిస్తోంది. 'తుని' నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.


More Telugu News