దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ రాజీనామా
- ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొనసాగించిన గత ప్రభుత్వం
- మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే రాజీనామా
- జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వలవన్
ఆంధ్రప్రదేశ్ లో అధికారుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా గత ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులను కొనసాగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మారడంతో సదరు ఉద్యోగులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా దేవాదాయ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన కరికాల వలవన్ ప్రభుత్వానికి రాజీనామా సమర్పించారు. వాస్తవానికి ఆయన పదవీ కాలం గతంలోనే పూర్తయింది.
అయితే, జగన్ సర్కారు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. అదే పోస్టులో కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వలవన్ మరో నెల రోజుల పాటు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో వలవన్ రాజీనామా చేశారు. కాగా, తన పదవీకాలం పొడిగించిన జగన్ ప్రభుత్వానికి వలవన్ పూర్తిస్థాయిలో సహకరించారని, జగన్ కు అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు.