కృష్ణా, గురువాయురప్పలను తలుచుకొని... ఎంపీగా సురేశ్ గోపి ప్రమాణం

  • కేరళలోని త్రిసూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపి
  • మలయాళంలో ఎంపీగా ప్రమాణం
  • మాతృభాషల్లో ప్రమాణం చేసిన పలువురు ఎంపీలు
కృష్ణా, గురువాయురప్పలను తలుచుకొని... ఎంపీగా సురేశ్ గోపి ప్రమాణం
18వ లోక్ సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళలోని త్రిసూర్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి సురేశ్ గోపి ప్రమాణానికి ముందు కృష్ణా... గురువాయురప్ప అని తలుచుకున్నారు. పోడియం ఎక్కి, మైక్ ముందుకు రాగానే దేవుళ్లను తలుచుకున్నారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

సురేశ్ గోపి మలయాళంలో ప్రమాణం చేశారు. ఈరోజు 280 మంది ప్రమాణం చేయగా... మిగిలిన వారు రేపు చేయనున్నారు. పలువురు బీజేపీ ఎంపీలు తమ తమ మాతృభాషలలో ప్రమాణం చేశారు. తెలుగు, మలయాళం, హిందీ, సంస్కృతం, డోంగ్రీ, ఒడియా భాషల్లో ప్రమాణం చేశారు.


More Telugu News