ప్రధాని మోదీని కలిసిన టీమిండియా క్రికెటర్లు
- ప్రధానితో ముగిసిన భారత క్రికెట్ జట్టు భేటీ
- టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని
- ప్రధానితో కలిసి అల్పాహారం చేసిన ఆటగాళ్లు
- సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టు మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భారత ప్లేయర్లు భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి అప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు.
ప్రధానితో భేటీ అయ్యాక భారత జట్టు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అక్కడ భారీ రోడ్ షో ఉంది. ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది.
ఓపెన్ టాప్ బస్సుపై భారత ఆటగాళ్లు రోడ్ షోలో పాల్గొననున్నారు. ముంబై నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ అనంతరం వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సన్మానించనుంది.